మొక్కజొన్న ధాన్యాన్ని గోడౌన్లలో దిగుమతి చేయడంలో విఫలమైన ప్రభుత్వం. :బట్టు సాంబయ్య
మండల కేంద్రం నల్లబెల్లిలోని మార్కపేట సెంటర్లో ఉన్న దాన్యం కాంటాలు అయి నెలగావస్తున్న ఆ ధాన్యాన్ని వాహనాల్లోకి ఎక్కించి గోడౌన్లలో దిగుమతి చేసుకొని ట్రక్ షీట్లుఇవ్వడంతో పాటు, వివిధ ప్రాంతాల నుంచి రైతులు స్వచ్ఛందంగా వాహనాలు సమకూర్చుకొని నల్లబెల్లికి వచ్చిన 100కు పైగా ట్రాక్టర్లు 10 డీసీఎంలు 8 ఎనిమిది లారీలలో ఉన్న ధాన్య బస్తాలను రైతు సొసైటీ గోడౌన్ లో దించడానికి హమాలీలు నిరాకరించడంతో రైతులంతా ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నా చేసే పరిస్థితికి రైతాంగాన్ని ఈ ప్రభుత్వం నెట్టివేసిందని సిపిఐ మండల కార్యదర్శి బట్టు సాంబయ్య విమర్శించారు. ఒకపక్క వాహనాలు సమకూర్చే కాంట్రాక్టర్ కు టెండర్ దక్కినప్పటికీ ఏప్రిల్ 23 నుంచి 30 తారీఖు లోపు అతను ప్రభుత్వ అధికారుల హామీ మీద వాహనాలు సమకూర్చినప్పటికీ సదర్ కాంట్రాక్టర్కు అగ్రిమెంట్ పేపర్లు ఇవ్వకపోవడం వలన అతను వాహనాలను సమకూర్చడం లేదు. దీంతో రైతులే స్వచ్ఛందంగా వాహనాలను మాట్లాడుకుని దాన్ని బస్తాలతో వచ్చినప్పటికీ గోడౌన్లలో ఖాళీ స్థలం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు నిన్నటి నుంచి మండల కేంద్రంలోని సొసైటీ గోడౌన్లో కూడా దిగుమతి చేసినప్పటికీ,ఈరోజు దిగుమతి చేయడానికి హమాలీలు నిరాకరించారు హమాలీలకు ఇవ్వవలసిన కూలీ డబ్బులు ఇచ్చేది ఎవరని హమాలీలు ప్రశ్నిస్తూ షట్టర్లు కిందికి గుంజి ఇళ్లలోకి వెళ్లారు స్థానిక ఎస్సై ఎమ్మార్వో గారు సాయంత్రం బస్తాల దిగుపతి లెక్క చెప్తే డబ్బులు ఇప్పిస్తామని చెప్పినప్పటికీ హమాలీలు వినలేదు మాకు డబ్బులు ఇవ్వడానికి ఎవరో ఒకరు డబ్బులకు హామీ ఇస్తే తప్ప బస్తాలు దించేది లేదంటూ వెళ్లిపోయారు. దీనితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఒకపక్క వాతావరణంలో మార్పులు వచ్చి వరుస సూచన ఉన్నట్టు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితులలో ప్రభుత్వము హనుమకొండలో రైతు మేళా పెట్టి సంబరాలు చేసుకుంటున్నది కానీ రైతాంగం యొక్క ధాన్యం పరిస్థితి పరిస్థితి గురించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపినట్టు కనబడటం లేదు ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే మార్క్ఫెడ్ కేంద్రాలను తనిఖీ చేసి తగిన సూచనలు ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శించారు

No comments:
Post a Comment