🔴
Loading latest posts...

Thursday, May 14, 2026

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్ల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీను, మండల పరిషత్ పాఠశాల హెచ్‌ఎం, హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, మార్కెట్ డైరెక్టర్, గ్రామ పెద్దలు కలిసి నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలను కలిసి వారి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tuesday, May 12, 2026

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలి....

హన్మకొండ, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ ను తక్షణమే అరెస్టు చేయాలని డివైఎఫ్ఐ జిలా కార్యదర్శి దొగ్గేలా తిరుపతి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్. దీప ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు.  మంగళవారం అంబేద్కర్ సెంటర్ లో డివైఎఫ్ఐ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బండి భగీరధ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధితురాలు పిర్యాదు చేయడానికి వెళ్తే పోలిసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి12 గంటలకు వరకు బాధితులను స్టేషన్ లో ఉంచి, ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేసారని తెలిపారు. నిందితులు కరీంనగర్ లో బదితురాలిపై "హాని ట్రాప్" కేసు పెట్టె వరకు పోలీసులు వేచి చూసి ఆ తర్వాతే పిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి కలిగిన వారి చుట్టంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటి బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బిజెపి నేతలు దీనికి ఎం సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. బిజెపి నాయకుల నుంచి మహిళలకు, బాలికలకు తీవ్ర ముప్పు పొంచిఉండని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దేశాన్ని కుదిపేసిన హత్రస్ ఉన్నవో కేసులో బీజేపీ ప్రభుత్వలు నిందితులను ఎలాగైతే కాపాడే ప్రయత్నం చేశాయో ఇక్కడ అదే ధోరణి కనిపిస్తోంది అని పేర్కొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ పాత్రపై విచారణ జరిపించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నుంచి తొలగించాలి అన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,  పోలీసులు నిందితులకు కొమ్ముకాయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాజకీయ ఒత్తిళ్ళ కు లొంగకుండా బండి భగీరధ్ కు వెంటనే అరెస్టు చేసి, బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎం. రమ, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ, రామతరా, యమునా, శ్వేతా, ఉమారాణి, కావ్య, యువన్, రజిత, మయూరి, రంజిత్, అరవింద్, అభినాష్ తదితరులు పాల్గొన్నారు.

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్..

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్.. 

బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన  నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

నేరేడుచర్ల చౌరస్తాలో బీఆర్‌ఎస్‌వై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్, భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్రపటాలను దహనం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

Monday, May 11, 2026

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి Conversation బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో నిర్వహించాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. బాధితురాలు బాలిక కావడం, కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే సిట్ బృందం కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక స్టేట్మెంట్‌ను చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు నమోదు చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని కీలక విషయాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశముందని సమాచారం. కేసులో ఉన్న ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా విచారించి నిజానిజాలు వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...